ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అమలు చేయకుండా, అన్ని వర్గాలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మాజీమంత్రి రోజా అన్నారు. ఆమె మాట్లాడుతూ.... అందరినీ వంచనకు గురి చేసింది. అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు, సీఎం అయిన 8 నెలల్లో ఏ పథకం అమలు చేయలేదు. అతి ముఖ్యమైన విద్య, వైద్య వ్యవస్థలు కుదేలయ్యాయి. రైతులు, ఆడబిడ్డలు, ఉద్యోగులు, నిరుద్యోగులు అన్న తేడా లేకుండా అన్ని వర్గాలను వంచించిన ఘనత చంద్రబాబుది. ఆదాయం పెరిగితేనే సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు ఎందుకు చెప్పలేదు? హామీల అమలుకు బాధ్యత తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఎక్కడున్నారు. లోకేష్ కాలర్ పట్టుకుంటే తప్ప పథకాలు అమలు కావా? అని ప్రశ్నించారు.