ప్రధాని ఏపీకి చేసిన మోసానికి ఎన్ని అవార్డు ఇచ్చినా తక్కువే అవుతుందని, నటనలో నరేంద్రమోడీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఉండవల్లిలో జరిగిన విలేకరు లు సమావేశంలో ఆమె మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేయని ప్రధాని మోడీ ఏ మొఖం పెట్టుకొని రాష్ట్రానికి వచ్చారని ఆమె ప్రశ్నించారు? నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు, న్ల బెలూన్ల తోటి రాష్ట్ర వ్యాప్తంగా, రాజకీయ పార్టీకు అతీతంగా ప్రజందరూ కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల నిరసన, దీక్ష వేడి మోడీని తాకేవరకు కొనసాగాలన్నారు. మా పార్టీ సిద్ధాంతాలకి, విలువలకు, రాష్ట్ర ప్రజ ప్రయోజనాల కోసం పోరాడుతూ ఆ పోరాటాన్ని ఇన్నాళ్లూ కొనసాగిస్తూ, ప్రజల్లో ఉంటూ వచ్చామన్నారు. మా పార్టీ అధ్యక్షు 27 సంవత్సరాకే ఎమ్మెల్యేగా గెలిచారు. 28 సంవత్సరానికే ఆయన మినిష్టర్ అయ్యారు. 45 సంవత్సరాలకే ముఖ్యమంత్రి అయ్యారన్నారు. జవాన్ల త్యాగాలను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారన్నారు. దేశంలో ఉన్న దళిత, పేద, బడుగు, బలహీన, మైనార్టీ, మధ్య తరగతి ప్రజలను వేధిస్తుంటే ఓట్ల కోసం సఫాయి కార్మికుల కాళ్లు కడుగుతూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడిన ఘనత ఆయనదేనని అన్నారు.. టీడీపీ అంటే రైతు సంక్షేమం అనే విధంగా 64 క్ష మంది రైతులకు లబ్ది చేకూర్చిందన్నారు. విశాఖ, చెన్నై పెట్రో కారిడార్, పారిశ్రామిక కారిడార్ గురించి మాట్లాడాలన్నారు. అవినీతి, ఆర్థిక, నేరగాళ్ల పార్టీలతో చేతులు కలిపి ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీ నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాన్నారు. వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక్క చుక్క గంగా ప్రక్షాళన కూడా చేయని మీరు ఒకసారి చంద్రబాబు చేసిన నదుల అనుసంధానంతో, రతనాల సీమగా మారిన రాయలసీమను, అన్నపూర్ణగా మారిన ఆంధ్రప్రదేశ్‌ను కళ్లారా చూచి ఇకనైనా రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సాధినేని యామిని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa