ప్రధాని మోడీకి ప్రచార ఆర్భాటాన్ని వదిలి ఐదు నిమిషాలు కూడా ఉండలేరని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మహారాష్ట్రలోని దూలేలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. భారత్ పాక్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న ఈ సమయంలోనూ ప్రచారానికి విరామం ఇవ్వడంలేదని ఎద్దేవా చేశారు. వార్ మెమోరియల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఆయన ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. హుందాగా వ్యవహరించాల్సిన కార్యక్రమాల్లోనూ ప్రధాని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పుల్వామా దాడి తరువాత కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించిందని అన్నారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని, దాడి తరువాత దేశం ఒక్కటిగా ఉండాలని కోరానని రాహుల్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa