కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిన్న 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపునిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ప్రకటించారు. దీనిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ ఏడాది ప్రకటించిన బడ్జెట్ 'మిడిల్ క్లాస్ బడ్జెట్' గా గుర్తుండిపోతుందని తెలిపారు. పైగా ఇది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రికార్డు స్థాయిలో 8వ బడ్జెట్ అని వెల్లడించారు. ఈ బడ్జెట్ తో దేశంలో మధ్య తరగతి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆదాయ పన్ను ఊరట, కస్టమ్స్ సుంకాలు తగ్గించడం, దృఢమైన ఆర్థిక సంస్కరణలతో... కష్టించి పనిచేసే కుటుంబాలకు ఈ బడ్జెట్ సాధికారత కల్పిస్తుందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి పథాన్ని మరింత బలోపేతం చేస్తుందని వివరించారు.