ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాడెన్‌ కుమారుడిపై ఆంక్షలు విధించిన ఐరాస

international |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2019, 06:42 PM

ఒసామా బిన్‌ లాడెన్‌ కుమారుడు హమ్జా బిన్‌ లాడెన్‌పై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షలు విధించింది. అతడి ఆయుధాల వ్యాపారం, ప్రయాణాలపై నిషేధం విధించింది. అల్‌ఖైదాకు ప్రస్తుత నాయకుడైన ఐమన్‌ అల్‌ జాహిరికి వారసుడిగా హమ్జాను గుర్తిస్తూ అతడ్ని బ్లాక్‌ లిస్టులో ఉంచింది. ఐమన్‌ అల్‌ జాహిరి అల్‌ఖైదా సభ్యుడిగా హమ్జాను ప్రకటించాడని.. అంతేకాకుండా అల్‌ఖైదా సభ్యులు దాడులకు పాల్పడేలా హమ్జా ప్రేరేపించాడని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పేర్కొంది. విధించిన ఆంక్షలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను ఆదేశించింది. ఇప్పటికే హమ్జాపై అమెరికా ఒక మిలియన్‌ డాలర్ల రివార్డును ప్రకటించింది. మరోవైపు నవంబరులో జారీ చేసిన ప్రభుత్వ ఆదేశాల మేరకు హమ్జా పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa