తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేక ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. ఆదివారం రాత్రి నుంచి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై హై డ్రామా కొనసాగుతోంది. ఆదివారం రాత్రి టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కార్పొరేటర్‌ను వైఎస్సార్‌సీపీ నేత భూమన లాక్కెళ్లినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. కోరం 25 మంది ఉండాలి. అయితే 22 మంది మాత్రమే ఉన్నారు. దీంతో అధికారులు ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికను మంగళవారం నాటికి వాయిదా వేశారు. ఒక వేళ మంగళవారం కూడా వాయిదా పడితే.. ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చి.. ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.