గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఎన్నికలు 2025 ఫిబ్రవరి 27న జరగనుండగా, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఫిబ్రవరి 3న నుంచీ నామినేషన్లు స్వీకరణ ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ఫిబ్రవరి 10వ తేదీ వరకు తమ నామినేషన్లు సమర్పించవచ్చు.ఈ నామినేషన్లు స్వీకరణ అనంతరం, ఫిబ్రవరి 11వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఉపసంహరించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను ఫిబ్రవరి 27న నిర్వహించనున్నారు. ఆ తరువాత, మార్చి 3వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. దీగతో ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి కార్యాచరణ పూర్తవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది.