2019 ఎన్నికలకకు ముందు పాకిస్తాన్‌తో యుద్ధం వస్తుందని తనతో రెండేళ్ల కిందటే చెప్పారని.. పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను పాకిస్తాన్ పత్రిక డాన్ కూడా ఉటంకించడంతో బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. పీకే అంటే పవన్ కల్యాణ్ కాదని, పాకిస్తాన్ అని విమర్శిస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు.
యుద్ధం వస్తుందని రెండేళ్ల కిందటే తనకు చెప్పారని తాను అంటున్న, పాకిస్తాన్‌లో ఏం జరుగుతుందో తనకెలా తెలుస్తుందని వ్యంగ్యంగా చెబుతున్న వీడియోను పవన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు యుద్ధం వస్తుందని తనతో ఎవరూ చెప్పలేదని వీడియో కింద రాసిన వివరణలో పేర్కొన్నారు. మేధావులు, రాజకీయ విశ్లేషకుల అంచనాలనే తాను ప్రస్తావించానన్నారు. అంతర్జాతీయ మీడియాను అనుసరించేవారికి ఇది అర్థమవుతుందని, దేశ పరిస్థితులను పరిశీలకులు ముందే ఊహించి యుద్ధం గురించి చెప్పారని పేర్కొన్నారు. తాన ఆ విషయాన్నే చెప్పాను తప్పితే పాకిస్తాన్ వాళ్లు మాట్లాడకుంటే తానెలా వింటానని వెటకారంగా అన్నారు. అయితే వీడియోలోని తొలి భాగంలో యుద్ధం వస్తుందని తనకు రెండేళ్ల ముందే చెప్పారని అనడం, తర్వాత తనకెవరూ చెప్పలేదని, కేవలం ప్రస్తావించానని పేర్కొనడంతో ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa