ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాజెక్టుల కోసం కోట్ల టీడీపీలోకి: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2019, 09:50 PM

ఇప్పటి వరకు జిల్లాలో కోట్ల, కేఈ కుటుంబాల మధ్యనే రాజకీయం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. రెండు కుటుంబాలు కలవడం చరిత్ర అన్నారు. చరిత్ర కలిగిన రెండు కుటుంబాలు ప్రాంత అభివృద్ధి కోసం కలిసాయని చెప్పారు. ఈరోజు కోడుమూరులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, భార్య సుజాతమ్మ, ఇతర నేతలు టీడీపీ లో చేరారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి అంటే అభిమానమని చంద్రబాబు తెలిపారు. నైతిక విలువలతో కోట్ల కుటుంబం రాజకీయం చేసింది... చిల్లర రాజకీయం చేయలేదన్నారు. కోట్ల, కేఈ కుటుంబాలు నైతిక విలువలతో బతికాయి. రాజకీయాల్లో ఎవరైనా మిత్రులు ఉన్నారంటే కోట్ల విజయ భాస్కర్ రెడ్డి అని ఎన్టీఆర్ చెప్పేవారు. నేను కూడా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి క్యాబినెట్ లో పనిచేసానన్నారు. కోట్ల సూర్య కలిసినప్పుడు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు కావాలన్నారు. కోట్ల ను టీడీపీ లోకి ఆహ్వానించగా, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం టీడీపీ లోకి వస్తానని కోట్ల చెప్పారు.
ఒకేరోజు 4 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఘనత టీడీపీ ది అని అన్నారు. వేదవతి, ఆర్డీఎస్ కుడికాలువ, గుండ్రేవుల ప్రాజెక్టులకు, తుంగభద్ర ఎల్లెల్సీ పైప్ లైన్ శంకుస్థాపన చేయడం నా అదృష్టం అన్నారు. ప్రాజెక్టులు రావాలంటే టీడీపీ కి ఓటు వేయండి. రాయలసీమ 214 టీఎంసీ ల నీళ్లు మొదటిసారి గా నీళ్లు ఇచ్చాం. నేను, డిప్యూటీ సీఎం కేఈ, కోట్ల రాయలసీమ బిడ్డలమే. రాయలసీమ ను రతనాల సీమ గా మారుస్తాం. కోట్ల అడిగిన కోడుమూరు కు ఇండోర్ స్టేడియం మంజూరు చేస్తున్నాను. కేఈ అడిగిన 68 చెరువులకు హంద్రీ నీళ్లు ఇచ్చేందుకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కోడుమూరు కు డిగ్రీ కాలేజి, తాగునీటి పథకం మంజూరు చేస్తున్నాని చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారు. 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa