భారత్-ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ మ్యాచ్ లు ఫ్రీగా ఎక్కడ చూడాలి? ఏ సమయంలో మ్యాచ్ లు జరుగుతాయి. పూర్తి వివరాలు మీకోసం. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కోసం భారత్ లో పర్యటిస్తోంది. ఇండియా-ఇంగ్లాండ్ మధ్య 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ముగిసింది. ఇండియా 4-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ఇప్పుడు ఇండియా-ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ జరగనుంది. మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో, రెండో మ్యాచ్ ఫిబ్రవరి 9న కటక్‌లో, మూడో మ్యాచ్ లో ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరగనుంది. 'మిని వరల్డ్ కప్' అని పిలువబడే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు జరుగుతున్నందున ఈ సిరీస్ రెండు జట్లకు కీలకం. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జోష్ నింపుకోవడానికి ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. టీ20 జట్టుతో పోలిస్తే భారత వన్డే జట్టు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
భారత్ - ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ లో మ్యాచ్ లు అన్ని మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం అవుతాయి. మొదటి వన్డే మ్యాచ్ నాగ్ పూర్ లోని విదర్బ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్ లో కటక్ లోని బరాబతి స్టేడియంలో జరుగుతుంది. ఈ సిరీస్ లో చివరిదైన మూడో వన్డే మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.
ఇండియా జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హర్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా,హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.