దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీలో ఓలా సంస్థ దూసుకెళ్తుంది. ఏ కంపెనీకి అందని రేంజ్‌లో స్కూటర్ మార్కెట్‌ని అతలాకుతలం చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఇప్పటికే దేశంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. ఆగస్టులో దేశీయ మార్కెట్లో విడుదల చేసిన ఈ రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అత్యంత సరసమైన వేరియంట్ ఎక్స్‌గా ఉంది. ఇది కేవలం 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధరను కేవలం రూ.74,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది అందరినీ షాక్‌కి గురిచేసింది. ఇక 3.5 కిలోవాట్ల, 4.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్స్ ధరలు వరుసగా రూ.84,999, రూ.99,999గా ఉన్నాయి. ఈ ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ సేల్ ఫిబ్రవరి 5న (రేపటి) నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. దీంతో నాలుగు నెలల ఎదురుచూపులకు తెరపడనుంది. దీనికి సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కంపెనీ ఇదివరకే విడుదల చేసింది.
ఈ బైక్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ని అందిస్తుంది. అలాగే ఇది రెగ్యూలర్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే రోడ్‌స్టర్ ఎక్స్ గరిష్టంగా గంటకు 124 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ఓలా రోడ్ స్టర్ ఎక్స్ 11 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేస్తుంది. మరోవైపు రోడ్‌స్టర్ రెగ్యులర్ వేరియంట్‌లో 13 కిలోవాట్ల యూనిట్ కలదు. ఇందులో జీరో-ఎమిషన్ మోడల్ క్రూయిజ్ కంట్రోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లు కలవు. ఇందులో రైడర్స్ గైడ్ కోసం 4.3 అంగుళాల LCD డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో ఇవే కాకుండా ఎల్ఈడీ లైటింగ్, రీజియన్ బ్రేకింగ్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్, టైర్‌ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, జియో, టైమ్ ఫెన్సింగ్ వంటి ఫీచర్లు కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ఉన్నాయి.