ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌ ప్రావిన్స్‌లో వరదలు

international |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2019, 12:41 PM

కాందహార్‌ : దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌ ప్రావిన్స్‌ను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు నేలమట్టం కాగా వరద నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ విషయాన్ని వెల్లడించిన ఐక్యరాజ్యసమితి కార్యాలయం అధికారులు.. గడిచిన 30 గంటల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. వరదల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారన్న యూఎన్‌వో.. మరో పది మంది గల్లంతైనట్లు వెల్లడించింది. వరదలతో 2 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని, శుక్రవారం నుంచి దాదాపు 400 కుటుంబాలను సైనికులు రక్షించినట్లు కాందహార్‌ డిప్యూటీ గవర్నర్‌ తెలిపారు. అటు సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్న అధికారులు భారీ వర్షాలు ఆటంకం కలిగిస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa