హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త, టీడీపీ సీనియర్ నేత, నరసాపురం లోక్‌సభ కన్వీనర్ రఘురామ కృష్ణం రాజు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఆదివారం లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసంలో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన కలిశారు. ఈ సమావేశంలో ఆపార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, సీనియర్ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలంతా వైఎస్‌ఆర్‌సీపీలో చేరాలని ఆకాంక్షించారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలి. విభజన హామీలు అమలుకావాలంటే జగన్ వల్లే సాధ్యమని ప్రజలు అంటున్నారు. వైఎస్ జగన్ కుటుంబంతో మాకు అనుబంధం ఉంది. విభజన హామీలు సాధించే సత్తా ఒక్క వైఎస్ జగన్‌కే ఉంది. తటస్తులు కూడా జగన్ సీఎం కావాలంటున్నారని ఆయన వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa