దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని KK సర్వే ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. ఆప్- 39 సీట్లు, బీజేపీకి 22 సీట్లు వస్తాయని తెలిపింది. ఈ నెల 8 న అధికారకంగా ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఢిల్లీలోని మొత్తంగా 70 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా, మహారాష్ట్ర ఎన్నికల్లో KK సర్వే ఫలితాలు విజయానికి అనుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే.