అమెరికాలో 40వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్.. ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వచ్ఛంధంగా ఉద్యోగాలకు రాజీనామా చేస్తే ఎనిమిది నెలల జీతం ముందుగానే ఇస్తామని ట్రంప్ ప్రభుత్వం చెప్పింది. ఈ ఆఫర్‌కు లక్షకు పైగా ఉద్యోగులు స్పందిస్తారని భావించినా.. గురువారం నాటికి కేవలం 40 వేల మంది మాత్రమే రాజీనామా చేశారు.ఈ మేరకు ఒక ఈమెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది.స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు.ఫిబ్రవరి 6 వ తేదీలోపు ఓ నిర్ణయానికి రావాలని అందులో వెల్లడించారు.దీనిని ఎంచుకొన్న వారికి సెప్టెంబర్ వరకు పనిచేయకుండానే జీతం పొందొచ్చని చెబుతున్నా,దానికి ఎలాంటి హామీ లేదని ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి.
సుమారు 10-15 శాతం మంది దీనిని ఎంచుకోవచ్చని ట్రంప్ కార్యవర్గం భావించింది.ఇది విజయవంతంగా అమలైలతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా 100 బిలియన్ డాలర్ల వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. ఓ వైపు ఫెడరల్ నిధులు, రుణాలను నిలిపివేసిన వేళ ఈ వార్త బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. చాలా స్థానిక సంస్థల ప్రభుత్వాలు,నాన్ ప్రాఫిట్ సంస్థల పై దీని ప్రభావం ఉండనుంది.