సౌతాఫ్రికా టీ20 లీగ్ (SAT20) 2025లో టైటిల్ రేసులో ముందుకు సాగుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తాజా క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా మూడోసారి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ జట్టు ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి చెందినదే కావడం విశేషం. పార్ల్ రాయల్స్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కేవలం 19.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ టోనీ డి జోర్జీ 49 బంతుల్లో 78 పరుగులు చేసి మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి జోర్డాన్ హెర్మాన్ అద్భుతమైన సహకారం అందించాడు. 48 బంతుల్లో 69 పరుగులు చేసిన అతను జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు, పార్ల్ రాయల్స్ బౌలర్లలో మఫాక, దునిత్ ఒక్కో వికెట్ తీసినా, సన్‌రైజర్స్ బ్యాటింగ్ దూకుడు ముందు వాళ్లు ప్రభావం చూపలేకపోయారు.
పార్ల్ రాయల్స్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కేవలం 19.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ టోనీ డి జోర్జీ 49 బంతుల్లో 78 పరుగులు చేసి మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి జోర్డాన్ హెర్మాన్ అద్భుతమైన సహకారం అందించాడు. 48 బంతుల్లో 69 పరుగులు చేసిన అతను జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు, పార్ల్ రాయల్స్ బౌలర్లలో మఫాక, దునిత్ ఒక్కో వికెట్ తీసినా, సన్‌రైజర్స్ బ్యాటింగ్ దూకుడు ముందు వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. ముందు బ్యాటింగ్‌కు దిగిన పార్ల్ రాయల్స్ 20 ఓవర్లలో 175/4 స్కోరు చేసింది. రూబిన్ హెర్మాన్ 81 అజేయ పరుగులు చేస్తూ నిలకడైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ ప్రిటోరియస్ 59 పరుగులతో జట్టును గట్టెక్కించాడు. సన్‌రైజర్స్ బౌలింగ్‌లో మార్కో జాన్సెన్, మార్‌క్రమ్, బార్టమన్ ఒక్కో వికెట్ తీశారు. సన్‌రైజర్స్ ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ (MI) కేప్ టౌన్‌తో తలపడనుంది. ఇప్పటికే గత రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన ఈస్ట్రన్ కేప్ జట్టు మూడోసారి కప్పును అందుకుంటుందో లేదో చూడాలి.