జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం ఏడుగురు చొరబాటుదారులు హతమయ్యారు. జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లా కృష్ణ ఘాటీ ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి ప్రవేశించేందుకు పాక్ చొరబాటుదారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు ఏడుగురు చొరబాటుదారులను అంతమొందించాయి. వీరిలో పాకిస్తాన్ ఆర్మీ చెందిన వారు ఇద్దరు ఉన్నట్లుగా తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa