ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కీలక పరిమాణం.. బీజేపీ మొదటిసారిగా తన గత రికార్డును బద్దలు కొట్టింది. మొత్తం 77 సీట్లలో 50 సీట్లను సాధించింది.ఉదయం 9:30 గంటలకు వెలువడిన ట్రెండ్‌ల ప్రకారం.. బీజేపీ 50 సీట్లలో ముందంజలో ఉండగా, ఆమ్ ఆద్మీపార్టీ 22 సీట్లలో, కాంగ్రెస్ 1 నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నాయి. 1993 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 49 సీట్లను సాధించింది. దాదాపు 32 సంవత్సరాల తర్వాత, దేశ రాజధానిలో బీజేపీ ఎన్నికల రికార్డును సృష్టిస్తోంది.మునుపటి ట్రెండ్‌ల ప్రకారం.. ప్రారంభ ట్రెండ్‌లలో బీజేపీ మెజారిటీ మార్కును దాటేసింది. దేశ రాజధానిలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. దాదాపు దశాబ్ద కాలంగా ఆప్ ఆధిపత్యం చెలాయించిన ఢిల్లీ రాజకీయంలో మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది.ఢిల్లీలో వరుసగా 15 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బలు చవిచూసింది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఢిల్లీలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఆధిపత్యం చెలాయించింది. అయితే, బీజేపీ ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేసి రెండు దశాబ్దాలకు పైగా విరామం తర్వాత దేశ రాజధానిలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది.కీలకమైన నియోజకవర్గాలలో న్యూఢిల్లీ కూడా ఉంది. ఇక్కడ ఆప్ నేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్, బీజేపీ పర్వేశ్ వర్మపై బరిలో దిగారు. ప్రస్తుత ఢిల్లీ సీఎం అతిషి బీజేపీకి చెందిన రమేష్ బిధురి, కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబాపై బరిలో నిలిచారు. మూడు పార్టీల నేతల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది.