పిచ్చి జగన్.. సైకో జగన్‌గా మారడమే జగన్ 2.0 అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి విమర్శించారు. శవం లేస్తే కానీ బయటకు రాని దుర్మార్గుడు జగన్‌రెడ్డి అని ఆరోపించారు. వైఎస్ విజయలక్ష్మి, షర్మిల ఆయుష్షు గట్టిది కాబట్టే జగన్‌కు దూరంగా ఉంటున్నారని చెప్పారు. జగన్ తీరు మారకుంటే.. ప్రజలే జగన్‌ను ఏపీ నుంచి బయటకు గెంటుతారని అన్నారు. ప్రజలు తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టిడించే పరిస్థితిని.. జగన్‌రెడ్డి తెచ్చుకోవద్దని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హెచ్చరించారు. ఆత్మలతో మాట్లాడే జగన్ మానసిక పరిస్థితి అందరికీ తెలిసిందేనని విమర్శించారు.లండన్‌లో తెచ్చుకున్న మందులు పని చేయట్లేదని జగన్ మానసిక పరిస్థితి చూస్తే అర్ధమవుతోందని అన్నారు.
జగన్ మానసిక పరిస్థితికి జాలిపడి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యానికి తాను సిఫార్సు చేస్తానని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ సాయంతోనైనా జగన్ ఓ మంచి డాక్టర్‌కు చూపించుకోవాలని హితవు పలికారు. అబద్ధాల్లో ఆస్కార్ పొందే సైకో జగన్మోహన్ రెడ్డి అని ఆక్షేపించారు. అసెంబ్లీకి వెళ్లి మాట్లాడమని జగన్‌ను ప్రజలు ఎన్నుకుంటే... అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. జగన్‌కు పిచ్చి ఏ స్థాయిలో ముదిరిందో అర్ధమవుతోందన్నారు. ఐదేళ్లు అసభ్యంగా మాట్లాడిన జగన్ నోట నీతులు విని ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. జగన్‌కు విశ్వసనీయత అనే పదం తెలుగులో రాయటం రాదు, ఇంగ్లీషులో అర్ధం తెలీదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు.
![]() |
![]() |