రాబోయే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ బీ ఫామ్ అందుకున్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ పార్టీ ఆఫీసులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కలిసి ఆలపాటికి బీఫామ్ ను అందజేశారు.