ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఏపీ కమలం నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ ఏపీ కార్యాలయంలో ఆనందోత్సవాలు మిన్నంటాయి. ఢిల్లీ గడ్డ బీజేపీ అడ్డా అనే నినాదాలతో బాణసంచా కాల్చి, బీజేపీ నాయకులు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత అడ్డూరి శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారం చేపట్టిందని గుర్తుచేశారు. అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొవటంతో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీలో అధికారంలో ఉన్నా అవినీతి పార్టీలను ప్రజలు తరిమి కొట్టారని చెప్పారు. రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ప్రజలు అధికారం ఇస్తారని తెలిపారు. ఢిల్లీలో బీజేపీకి అధికారం కట్టబెట్టిన ప్రజలకు అడ్డూరి శ్రీరామ్ ధన్యవాదాలు తెలిపారు.
![]() |
![]() |