ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రచారం ఢిల్లీ ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అద్భుత విజయం సాధించిన బీజేపీలోని ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనా దక్షతకు ఈ గెలుపు నిదర్శనం అన్నారు.మోదీ సారథ్యంలో అప్రతిహతంగా విజయయాత్ర సాధిస్తున్న బీజేపీకి మరిన్ని విజయాలు సాధించాలి. కోరుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అభివృద్ధికి ఇచ్చే ప్రాధాన్యత ఢిల్లీలో బీజేపీ గెలుపుతో కష్టమైందన్నారు. ప్రజలు అవినీతిని ఎప్పటికీ సహించరని ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలు నిరూపించారని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఢిల్లీలో మరింత మెరుగైన పాలన, అభివృద్ది ప్రజల చెంతకు చేరాలని ఆకాంక్షించారు.
![]() |
![]() |