గీత కులాల మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ ప్రక్రియ వాయిదా పడినట్లు సోమవారం పల్నాడు జిల్లా ఎక్సైజ్ అధికారి మణికంఠ తెలిపారు. జిల్లాలో 13 మద్యం షాపులకు లైసెన్సుల జారీకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోమవారం జరగవలసిన లాటరీ ప్రక్రియ నిర్వధికంగా వాయిదా పడినట్లు పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో 13 దుకాణాలకు 199 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు.
![]() |
![]() |