ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో పవిత్రస్నానాలు ఆచరించేందుకు ఈరోజు(సోమవారం) భారీ సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి తరలివస్తున్నారు.ఈ నేపధ్యంలో అప్రమత్తమైన అధికారులు ఎటువంటి ప్రమాదకర ఘటన జరగకుండా ఉండేందుకు ప్రయాగ్‌రాజ్ సంగమం రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో రైలు ప్రయాణికులు ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక్కడి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నాక, సంగమం స్టేషన్‌ను తిరిగి తెరుస్తామని అధికారులు చెబుతున్నారు.ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రతిరోజూ భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లోని రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతోంది. ఇదేతరహాలో సంగమం రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికుల భారీ రద్దీ ఏర్పడుతోంది. దీనిని నివారించేందుకు ఈస్టేషన్‌ను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వేశాఖ అదనపు రైళ్లను నడుపుతోంది. అలాగే కుంభమేళాకు వచ్చే భక్తులకు రైల్వే స్టేషన్లలో ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.
![]() |
![]() |