ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహా కుంభమేళాకు ట్రాఫిక్ గుబులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 05:46 PM

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు రోజురోజుకు లక్షలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లోని అనేక చోట్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రధానంగా జబల్‌పూర్-కట్ని-సియోని వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాగ్‌రాజ్ చేరుకునేందుకు అనేక మంది భక్తులకు ఎక్కువ సమయం పడుతుంది. పలు నివేదికల ప్రకారం 500 కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్‌ ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇది చరిత్రలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్‌లలో ఒకటని చెబుతున్నారు.అయితే ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా సందర్శన కోసం వెళ్ళే వారు ఈ ట్రాఫిక్ పరిస్థితులను ముందుగా తెలుసుకుని వెళ్లాలని సూచిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ, రహదారి మూసివేత మార్గాల గురించి రియల్ టైమ్ అప్‌డేట్‌లు తెలుసుకోవడం ద్వారా మీరు సులభంగా మీ గమ్యానికి చేరుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ ఈ విషయంలో మీకు కీలక సమాచారాన్ని ప్రత్యేకంగా అందిస్తున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa