ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇవాళ టీడీపీలో చేరారు. భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం, మాడుగుల మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావులు.. ఇవాళ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కర్రి సీతారాం, పూడి మంగపతిరావులను మంత్రులు గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణలు వెంటబెట్టుకొచ్చారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలైన కర్రి సీతారాం.. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa