సూపీ సెహన్‌షా హజరత్ సయ్యద్ ఖాదర్‌వలీ బాబా ఉరుసు, సుగంధ మహోత్సవాలు సోమవారంతో ముగిశాయి. దేశ, విదేశాల నుంచి విచ్చేసిన భక్తులు దర్గాలో సుగంధ దవ్యాలు, వివిధ రకాల పుష్పాలు చాదర్ బాబాకు సమర్పించుకున్నారు. పులి వేషాలు, డప్పుల వాయిద్యాలతో నగరంలో ఊరేగింపు నిర్వహించారు. మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఉత్సవాల్లో విశ్వశాంతి కోసం పీఠాదుపతులు ప్రార్థనలు చేశారు. ఉత్సవాలకు పలువురు ప్రముఖులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వం అధికారికంగా అందించిన చాదర్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమర్పించారు. ఈ సందర్భంగా ఖాదర్‌వలీ బాబా దర్గా- దర్బార్ ముతావల్లీ ఖలీల్‌బాబు మాట్లాడుతూ ప్రపంచశాంతి కోసం సూఫీ శాంతి విధానాన్ని ప్రతిఒక్కరు పాటించాలని పిలుపునిచ్చారు. లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందించామన్నారు. విశ్వశాంతిని ఆకాంక్షిస్తు ప్రేమ, దయాతత్వాలను ప్రబోధిస్తూ సూఫీ పీఠాధిపతి హజరత్ మహమ్మద్ అతావుల్లా షరీఫ్‌షా తాజ్ ఖాదరీబాబా ఆధ్యాత్మిక వారుసులు సజ్జాద్‌నషీన్ మహమ్మద్ ఖ్వాజా మెహియిద్దీన్‌షా ఖాదరీ బాబా దివ్యసందేశాన్ని అందించారు. బాబాకు ఫకీర్ మేళా ఖవ్వాలీలో భక్తిగీతాలు ఆలపించారు. కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
![]() |
![]() |