మక్కువ పరిధిలోని శంబర పోలమాంబ అమ్మవారి మూడో వారం జాతర మంగళవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ తెలిపారు. అమ్మవారి లడ్డూ ప్రసాదం సిద్ధం చేశామని చెప్పారు. సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో 130 మం ది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్టు మక్కవ ఎస్‌ఐ ఎం.వెంకటరమణమూర్తి తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా శంబర గ్రామానికి బస్సులు నడపనున్నట్టు సాలూరు, పార్వతీపురం డిపో మేనేజర్లు తెలియజేశారు.
అలానే..... శంబర పోలమాంబ అమ్మవారి ఆలయాల హుండీల లెక్కింపును సోమవారం నిర్వహిం చారు. చదురుగుడి వద్ద ఉన్న ఆరు శాశ్వత హుండీలను తెరిచి లెక్కించగా రూ.14లక్షల 62వేల 984, వనంగుడి వద్ద ఆరు హుండీల ద్వారా రూ.4లక్షల 53వేల 199 ఆదాయం.. మొ త్తం కలిపి రూ.19లక్షల 16వేల 183 వచ్చినట్టు ఆలయ ఈవో సూర్యనారాయణ తెలిపారు. ఈ హుండీల ఆదాయం మూడు నెలల 7 రోజులకు చెందినదని చెప్పా రు. ఉత్సవ కమిటీ చైర్మన్ మైదాన తిరుపతిరావు, ఎంపీటీ సీ తీల్ల పోలినాయుడు, ఉప సర్పంచ్ అల్లు వెంకటర మణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.