గ్రామాల్లో ప్రజల నుంచి వచ్చే భూ సమస్యలపై క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కొత్తూరు మండలంలోని కంచా లుపేటలో గల ఓ ప్రైవేటు మండపంలో సమావేశం సోమవారం నిర్వహించారు. అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణకు గాను ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. వంటశాలను పరిశీలించి అపరిశుభ్రంగా ఉండడంతో వంట కార్మికులను ప్రశ్నించారు. మీ ఇంటిలో వంట సామగ్రిని ఇలాగే ఉంచుతారా అని ప్రశ్నించారు. వంట కార్మికులపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎం డీఎల్ నరసింహంను ఆదేశించారు. పాఠశా లలో ఉన్న మురుగనీరు వెళ్లేందుకు కాలువ నిర్మాణం చేపట్లాన్నారు.
100 కంటే ఎక్కువ ఫిర్యాదులు ఉంటే ఆర్డీవో లేదా జేసీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకు ని చర్యలు తీసుకునేందుకు సమీక్ష సమావేశమని తెలిపారు. జిల్లాలో 67 గ్రామాల్లో భూ సమస్యలున్నట్టు గుర్తిం చామని, 40 ఫిర్యాదులుంటే తహసీల్దార్ స్వయంగా వెళ్లి సమస్యలను పరిష్కరించాలన్నారు. ల్యాండ్ బ్యాం కులకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. జనన, మరణ, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను గడువు తేదీలోగా మంజూరు చేయాలన్నారు. రీ సర్వేలను సమగ్రంగా పరిశీలించాలన్నారు. సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, తహసీల్దార్ రవిచంద, ఎంపీడీవో నీరజ, కురిగాం సీహెచ్‌సీ వైద్యాధికారి సందీప్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
![]() |
![]() |