మహాశివరాత్రి సందర్భంగా కొవ్వూరు గోష్పాదక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆర్డీవో రాణి సుస్మిత ఆదేశించారు. మహాశివరాత్రికి గోష్పాదక్షేత్రంలో చేపట్టవలసిన ఏర్పాట్లపై అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహాశివరాత్రికి గోష్పాదక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధి కారులు సమన్వయంతో ముం దస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. స్నానఘట్టాల్లో నాచు ను, ఇసుక మేటలను తొలగించి ఘాట్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
జల్లు స్నానాలు ఏర్పాటు చేయాలన్నారు. నదిలో ప్రమాదాలు జరగకుండా మెస్‌లు, పడవులు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆర్డీవో సూచించారు. పారిశుధ్యం, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, స్త్రీలు బట్టలు మార్చుకునే గదులు ఏ ర్పాటుచేయాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలన్నారు. అలాగే డివిజన్ పరిధిలోని వేగేశ్వరపు రం, తాళ్లపూడి, ప్రక్కిలంక, వాడపల్లి, సిద్ధాంతం, పెండ్యాల, ముక్కామల గోదావరి స్నానఘట్టాలను శుభ్రపరిచి, విద్యుత్ లైటింగ్, పారిశుధ్య పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాలని డివిజనల్ పంచాయతీ అధికారికి వివరించారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని తహశీల్దార్ దుర్గాప్రసాద్‌ను ఆదేశించారు. అయితే శివరాత్రి ఏర్పా ట్లకు ఎటువంటి నిధులు లేవని భారంగా మా రుతుందని అధికారులు తెలియజేశారు. దీనిపై క్షేత్రంలోని సుమారు 14 దేవాలయాలు ఉన్నా యని వారంతా ఖర్చును భరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, పట్టణ ఎస్‌ఐ కె.జగన్మోహనరావు, ఏజీఆర్‌బీ ఏఈ జి.మణికంఠరాజు, ఎలక్ట్రికల్ ఏడీఈ ఎం.కృష్ణనాయక్, టౌన్ ఏఈ డి.జగదీశ్వరరావు, రూరల్ ఏఈ సీహెచ్ శ్రీనివాసరావు, మున్సిపల్ మేనేజర్ పి.సాయిబాబు, అగ్నిమాపక శాఖాధికారి ఏవీఎస్‌ఎన్‌ఎస్. వేణు, శివాలయం అర్చకులు మానేపల్లి శ్రీనివాసరావు, ఎస్.ధర్మరాజు, మత్య్సశాఖ, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు.
![]() |
![]() |