తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం మాఘ పౌర్ణమి సందర్భంగా వేంకటేశ్వరస్వామిని ( దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. 30 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు.టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 67,192 మంది భక్తులు దర్శించుకోగా 20,825 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.15 ఆదాయం వచ్చిందన్నారు. బుధవారం తెల్లవారుజామున ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు.
![]() |
![]() |