త్వరలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ పోరాట గాథ విద్యార్థులకు చేరువకానుంది. స్కూల్ పాఠ్యపుస్తకాల్లో అతని పోరాటాన్ని చేర్చాలంటూ రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దొతాస్ర ఈ రోజు ప్రతిపాదించారు. ఐఏఎఫ్ పైలట్ అభినందన్ జోధ్‌పూర్‌లోనే విద్యాభ్యాసం చేసినట్టు మంత్రి గోవింద్ ఇవాళ ట్విటర్లో పేర్కొన్నారు. వైమానిక దాడుల సమయంలోనూ, ఆ తర్వాత అభినందన్ కనబర్చిన ధైర్య సాహసాలకు గుర్తింపుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆయనను గౌరవించేందుకే రాజస్థాన్ స్కూల్ సిలబస్‌లో అభినందన్ జీవిత చరిత్రను పొందుపర్చనున్నట్టు వెల్లడించారు. దీంతో అభినందన్ వర్థమాన్ సాహస గాథను రాజస్థాన్ విద్యార్థులు ఇకపై పాఠ్యాంశంగా చదవుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa