జాతీయ లోక్ అదాలతలో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అనంతపురం జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్‌ఎ్‌సఏ) కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ సూచించారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో బీఎ్‌సఎనఎల్, ఏపీఎ్‌సఆర్టీసీ, ఇన్సూరెన్స, బ్యాంకింగ్, మున్సిపల్, పంచాయతీ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. డీఎల్‌ఎ్‌సఏ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత చైర్మన శ్రీనివాసరావు పాల్గొన్నారు.
![]() |
![]() |