అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలో కుక్కల నియంత్రణ పేరుతో జరిగిన అవినీతిపై చర్య లు తప్పవని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ స్పష్టం చేశారు. స్థానిక 17వ డివిజనలో బుధవారం మీ ఇంటికి - మీ ఎమెల్యే కా ర్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి సమస్యలపై ఆరా తీశారు. గత ఐదేళ్లలో చిన్న పని కూడా చే యకుండా ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు, ఇతర అభివృద్ది కార్యక్రమాలు చేశా మన్నారు. నగరంలో కుక్కల సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపు తామన్నారు. నగర పరిధిలో జాతీయ రహదారి పనులు సరిగా చేయ లేదని, ఎక్కడ చూసినా వంకర, టింకరగా కనిపిస్తోందన్నారు. త్వరలో పరిష్కారం చూపుతామన్నారు. నాయకులు మణికంఠబాబు, సికిందర్, వేణు, నాగరాజు, సాయి ఈశ్వరి, సరిపూటి రమణ, రాజారావు, పోతుల లక్ష్మీనరసింహులు, కడియాల కొండన్న, పరమేశ్వరన, పీఎల్‌ఎన మూ ర్తి, రాయల్ మురళి, లక్ష్మీనరసింహ, గోపాల్ గౌడ్, వెంకటేశ్వరరెడ్డి, సైఫుద్దీన, ఇస్మాయిల్, కృష్ణకుమార్, ముక్తియార్, రాంబాబు పాల్గొన్నారు.
![]() |
![]() |