శ్రీకాకుళం జిల్లాలో జిబిఎస్ వైరస్ కలకలం రేగింది. సంతబొమ్మాళి మండలం, కాపు గోదాయవలసలో ఆందోళన నెలకొంది. ఇటీవల గ్రామానికి చెందిన పదేళ్ల యువంత్ అనే బాలుడు మృతి చెందాడు. జిబిఎస్ లక్షణాలతో బాలుడు మృతి చెందాడంటూ ప్రచారం జరిగింది. దీంతో ఆ గ్రామంలో జిల్లా వైద్యాధికారుల బృందం పర్యటించింది. విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహించింది. జిబిఎస్ లక్షణాలతో బాలుడు మృతిచెందినట్టు ఇంకా నిర్ధారణ కాలేదని వైద్యాధికారులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్ళితే.... సంతబొమ్మాళి మండలం కాపుగోదాయ వలసలో గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) వైరస్ కలకలం రేగింది. ఇటీవల గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు వాతాడ యువంత్ ఈ వ్యాధితో మృతి చెందాడని ప్రచారం జరుగు తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో ఈ వైరస్‌తో చాలా మంది మృతి చెందగా ఇటీవల తెలంగాణలో కూడా ఆ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కాపు గోదాయవలసకు చెందిన యువంత్‌కు ఈ వైరస్ సోకి మృతి చెందాడన్న అనుమానంతో డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది బుధవారం గ్రామాన్ని సందర్శించారు. యువంత్ కుటుంబ సభ్యులతో మాట్లాడి.. బాలుడికి నిర్వ హించిన వైద్య పరీక్షల నివేదికలను పరిశీలించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి వైద్య పరీ క్షలు నిర్వహించారు. గ్రామంలో జ్వరం, గొంతునొప్పి తదితర లక్షణాలతో బాధపడుతున్న వారి వివరాలను వైద్యులు సేకరించారు. పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వ హించారు. బాలుడు యువంత్ జీబీఎస్ వైరస్‌తో మృతి చెందాడన్న దానిపై ఇంకా నిర్ధారణ కావల్సి ఉందని డీఎంహెచ్‌వో బాలమురళీ కృష్ణ తెలిపారు. ఇటువంటి వ్యాధి మూడులక్షల మందిలో ఒకరికి సోకుతుందని వెల్లడించారు. గ్రామంలో పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇది అంటువ్యాధి కాదని, దీనిపై ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
![]() |
![]() |