ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.ఇందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజామల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈ నెల 14న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారులు తెలిపారు. ఈ మినీ జాబ్ మేళాలో Agrisol India Pvt Ltd, Young India, Enovizon Integrated Facility Management Services Pvt Ltd, వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి. దీనికోసం పదవ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చు.14-02-2025 వ తేదీ ఉదయం 09:00 గంటల నుండి ఈ ఉద్యోగమేళా జరగనుంది. ఇందుకు సంబంధించిన బనగానపల్లె నియోజకవర్గం సంజామల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని.. జిల్లా ఉపాధికల్పనా అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగం మేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి జీతం నెలకు పది వేల రూపాయలు నుంచి 20,000 రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకురావాలని సూచించారు.
![]() |
![]() |