గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కోళ్ల రేట్లు అంతకంతకు పడిపోయిన పరిస్థితి నెలకొంది. కిలో 100 నుంచి 120 రూపాయలకు నిర్వాహకులు అమ్మకాలు నిర్వహిస్తున్న పరిస్థితి గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం గోదావరి జిల్లాలో చికెన్ తినాలంటే ప్రజలు భయపడి పోవాల్సిన పరిస్థితులు సైతం ఎదురవుతున్నాయి.గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. గోదావరి జిల్లాల్లో వైరస్‌తో చనిపోతున్న కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో తీసుకున్న శాంపిల్స్ పాజిటివ్‌గా వచ్చింది. దీంతో మరోసారి రెడ్ జోన్, సర్వే లెన్స్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజమండ్రి కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూంలో 95429 08025 నెంబర్ ఏర్పాటు చేశారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలని హై అలెర్ట్ జారీ చేశారు. అయితే ప్రజలు కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలని పశు సంవర్ధక శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
![]() |
![]() |