ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. టెస్టుల్లో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా తేలినట్లు రావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వివరాల ప్రకారం ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలో కోళ్ల ఫాంకు దగ్గరలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో, అతడికి టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ తేలింది. ఈ క్రమంలో వైద్యశాఖ అధికారులు అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యశాఖ అధికారిణి డాక్టర్ మాలిని మాట్లాడుతూ.. "జిల్లాలో ఓ వ్యక్తిని బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇక్కడ తొలి కేసు నమోదైంది. దీంతో, కేసు నమోదైన ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని తెలిపారు.మరోవైపు.. ఏలూరులోని బాదంపూడిలో కిలోమీటర్ మేర ఇన్ఫెక్టెడ్ జోన్ గా అధికారులు ప్రకటించారు. 10 కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ జోన్లుగా విధించారు. ఇన్ఫెక్టెడ్ జోన్ లో ఉన్న కమర్షియల్ ఫామ్ కోళ్లను, నాటు కోళ్లను పూర్తిగా కిల్లింగ్ చేసి ఖననం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వుల్లో తెలిపారు. ఏలూరు జిల్లా పశు సంవర్ధక కార్యాలయంలో 24X7 కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఫోన్ నెంబర్ 99667 79943 ఇచ్చారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా సమాచారాన్ని అందించాలని హై అలర్ట్ జారీ చేశారు.
![]() |
![]() |