ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ అరెస్టుతో అల్లర్లు జరిగే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు భావించి కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు . 140, 308, 351 రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద మొత్తం 7 కేసు నమోదు చేశారు పటమట పోలీసులు.గచ్చిబౌలిలోని మైహోమ్ భుజాలో ఉన్న వంశీని రాయదుర్గం పోలీసుల సహకారంతో గురువారం అరెస్ట్ చేశారు.
![]() |
![]() |