గుంటూరు జిల్లా వినుకొండ తెలుగుదేశం పార్టీ టిక్కెట్ తనకు ఇవ్వమని ‘పారా లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ ఛైర్మన్ డాక్టర్ పి.లక్ష్మయ్య టిడిపి అధినేత ‘చంద్రబాబునాయుడు’ను కలసి కోరారు. తాను 2004లోనే టిడిపి టిక్కెట్‌ను అడిగానని, కానీ, అప్పటి పరిస్థితుల్లో టిక్కెట్ ఇవ్వలేదని, ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తనకు టిక్కెట్ ఇస్తే…భారీ మెజార్టీతో గెలుస్తానని ఆయన ‘అధినేత’కు వివరించారు. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి ‘వినుకొండ’లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితిని గురించి వివరించారు. ప్రస్తుత ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులుపై నియోజకవర్గంలో అసంతృప్తి నెలకొందని, ఆయన ప్రజలకు అందుబాటులో లేరని, ప్రజలకు అందుబాటులో ఉండే తనకు టిక్కెట్ ఇస్తే..మరోసారి ఇక్కడ టిడిపి విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. తాను గత 15సంవత్సరాల నుంచి నియోజకవర్గ ప్రజలకు అనేక సేవలు చేస్తున్నానని,తనకు అవకాశం ఇస్తే..నియోజకవర్గంలో మంచిమెజార్టీతో విజయం సాధిస్తానని, దాంతో పార్లమెంట్ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి సులువుగా విజయం సాధిస్తాడని ఆయన వివరించారు. ‘పివి లక్ష్మయ్య’ చెప్పే అంశాలను ముఖ్యమంత్రి సావధానంగా విన్నారని ఆయన తెలిపారు. మొత్తం మీద…నిన్నటి దాకా..గుంటూరు జిల్లాల్లో టిడిపి గెలిచే మొదట సీటు..’వినుకొండ’ అని..పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భావించగా…అదే నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై టిడిపి అభిమానులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే జివి వ్యవహరించిన తీరే దీనికి కారణమని, టిడిపికి బలమైన మద్దతు దారులున్న ఈనియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితిపై కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా..ఇప్పటికైనా..ఎమ్మెల్యే జివి తన వ్యవహారశైలిని మార్చుకుంటే బాగుంటుందని కొందరు సలహా ఇస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa