గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితులకు విజయవాడ కోర్టు షాక్ ఇచ్చింది. 31 మంది నిందితులు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. బుధవారం కేసుకు సంబంధించిన వాదోపవాదనలు జరగగా..
గురువారం వారి బెయిల్ కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇదే కేసులో రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉన్న ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ పోలీస్ కస్టడీలో ఉన్నాడు.
![]() |
![]() |