ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళని అత్యాచారం చేసిన తాంత్రికుడు

national |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 12:43 PM

పేదరికం నుంచి విముక్తి కలిగిస్తానని మాయమాటలు చెప్పి, ఓ మహిళపై తాంత్రికుడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. మానసిక ప్రశాంతత లేకుండా ఆర్థిక సమస్యలతో సతమతవుతున్న ఇద్దరు భార్యాభర్తలు.. అమిత్‌ అనే తాంత్రికుడిని ఆశ్రయించారు. ఆర్థిక సమస్యలు లేకుండా శాంతి కలగాలంటే క్షుద్ర పూజలు చేయాలని అమిత్‌.. దంపతులకు సూచించాడు. సోమవారం రాత్రి దంపతుల ఇంటికి వచ్చిన తాంత్రికుడు.. పూజల కోసం సామాగ్రిని అడిగాడు. దీంతో పూజా సామాగ్రి కోసం భర్త మార్కెట్‌కు వెళ్లగా.. భార్య ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదునుగా భావించిన అమిత్‌.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి అమిత్‌ పారిపోయాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించాడు. మొత్తానికి జరిగిన ఘటనను తన భర్తకు చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమిత్‌ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa