హైదరాబాద్: అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాద కేసులో ఇవాళ సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది. రాజకీయంగా సున్నితంగా మారిన ఈ అంశంపై మధ్యవర్తి చర్చల ద్వారా పరిష్కారం కోరే దిశగా కోర్టు ప్రయత్నాలు చేపట్టింది. కేసులో పిటిషన్ వేసిన హిందూ మహాసభ తన వాదన వినిపించింది. మధ్యవర్తి ద్వారా చర్చలు వ్యర్థ ప్రక్రియ అని హిందూ మహాసభ కోర్టుకు పేర్కొన్నది. ఈ అంశాన్ని కోర్టే నిర్ణయించాలన్నది. చర్చల ప్రక్రియకు ప్రజలు అంగీకరించనన్నది. హిందూ మహాసభ వాదనపై జస్టిస్ ఎస్ఏ బోదే స్పందించారు. ఎవరు ఎప్పుడు అక్రమిస్తారో చెప్పలేమని, అయోధ్యను ఆక్రమించిన సమయంలో బాబర్ చక్రవర్తిగా ఉన్నారని, అక్కడ మసీదు ఉందో, ఆలయం ఉందో ఎలా చెప్పగలమన్నారు. చర్చలు విఫలమవుతాయని మీరంటున్నారు, ముందే ఎందుకు ఆ అంశాన్ని అంచనా వేస్తున్నారు, మీడియేషన్ చేయాలని మేం ఆలోచిస్తున్నాం, ఇది ఒక భూమి అంశమే కాదు, ఇందులో మనోభావాలు, విశ్వాసాలు కూడా ఉన్నాయని జస్టిస్ బోదే తెలిపారు. గతంలో జరిగిన దానిపై మనకు నియంత్రణ లేదని, ఇప్పుడున్న దానిపైన మాత్రమే మేం నిర్ణయం తీసుకోగలమన్నారు. అయోధ్య అంశంపై చర్చలను కెమెరా చిత్రీకరణ మధ్య జరగాలని ముస్లింల తరపున వాదించిన రాజీవ్ ధావన్ డిమాండ్ చేశారు. జస్టిస్ చంద్రచూడ్ దీన్ని వ్యతిరేకించారు. కోర్టు సమక్షంలో చర్చలు జరగాలన్న అంశంపై తీర్పును రిజర్వ్‌లో ఉంచినట్లు అయిదుగురు సభ్యలు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. అయోధ్య సమస్య పరిష్కారంలో చర్చల వ్యవహారం అవసరం లేదని యూపీ ప్రభుత్వం కోర్టు ముందు వాదించింది. ఒకవేళ చర్చలు నిర్వహిస్తే, ఎవర్ని ఆ చర్చలకు ఆహ్వానించాలో ఆయా పిటిషన్‌దార్లు వెల్లడించాల్సి ఉంటుందని చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa