కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. జలాలాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని ఓ నిర్మాణ కంపెనీ వద్ద చోటు చేసుకున్న ఆత్మాహుతి దాడిలో నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. అయితే కంపెనీ వద్ద మిలిటెంట్లకు, బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి యూఎస్ బలగాలు చేరుకున్నాయి. ఈ ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని ఇటు తాలిబన్, అటు ఐసీస్ ఉగ్రవాదులు కానీ ప్రకటించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa