ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలిరాత్రి నుంచే భార్యను వేధించిన భర్త..

national |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 01:03 PM

తల్లిదండ్రుల బలవంతం చేయడం వల్లనే తాను పెళ్లిచేసుకున్నానని, తనని విడిచిపెట్టి వెళ్లి పోవాలంటూ ఓ అనుమానపు భర్త పెళ్లయిన మొదటి రోజు నుండే భార్యను వేధించిన ఘటన బెంగళూరు నగరంలోని బసవనగుడిలో జరిగింది. ఆరునెలల క్రితం బెంగళూరు నగరానికి చెందిన యువతితో వివేక్ రాజగోపాల్ వివాహమైంది. కాగా వివాహమైన మొదటి రాత్రి నుండే వివేక్ రాజగోపాల్ భార్య పట్ల అనుమానాన్ని పెంచుకున్నాడు. 


 తనపై అనుమానంతో తన మొబైల్ ఫోన్‌లోని కాల్స్, మెసేజ్‌లను పరిశీలించేవాడని, ఆ తర్వాత ప్రతిరోజు అనుమానించడం మొదలుపెట్టినట్లు బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది. తనను ఉద్యోగానికి పంపించి, వచ్చే జీతం డబ్బును ఇవ్వాలని వివేక్ వేధించేవాడని, అలాగే తనతో అసభ్యంగా మాట్లాడే ఆడియో, బెడ్‌రూమ్ వీడియోతో ఆమెపై బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడని తెలిపింది. 


 


డబ్బు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించేవాడని బాధితురాలు ఆరోపించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి పుట్టింటికి తిరిగి వచ్చేసింది. అనంతరం ఘటన పట్ల బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భర్త వేధింపులు తట్టుకోలేకే పుట్టింటికి వచ్చినట్లు తెలిపింది. అతడిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa