తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని ఆదివారం రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుటుంబ సమేతంగా కొండపోచమ్మ ను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చన చేయించారు. ఆలయ అర్చకులు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ దంపతులకు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ దంపతులకు అమ్మవారి సారే, ప్రసాదం అందించి శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా కొండపోచమ్మ అమ్మ వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కొమురెల్లి మల్లన్న దర్శించుకున్న అనంతరం కొండపోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి మొక్కలు తీర్చుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాడిపంటలు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారి మొక్కుకున్నట్టు తెలిపారు. కొండపోచమ్మ వారోత్సవాలు ఐదో వారం కావడంతో భక్తులు వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని నైవేద్యం సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మహేందర్ రెడ్డి, కనకయ్య, హరి, చిన్నా, సుధాకర్, లక్ష్మణ్, చందు తదితరులు పాల్గొన్నారు...
![]() |
![]() |