ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాకింగ్ ఘటన.. గర్భం దాల్చిన పదోతరగతి విద్యార్థిని.. నొప్పులు భరించలేక..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 01:44 PM

చిత్తూరు జిల్లా పలమనేరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థిని గర్భం దాల్చింది. నెలలు నిండి ప్రసవ సమయంలో నొప్పులు భరించలేక ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఆమెకు గర్భం చేసింది ఎవరో కూడా తెలియదు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధిత బాలిక(16) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.ఆమె తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తుంటారు. ఏం జరిగిందో తెలీదు.. ఏ కామాంధుడి కన్ను పడిందో తెలియదు. 
కొన్ని నెలల కిందట బాలిక గర్భం దాల్చింది.
విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను పాఠశాలకు పంపలేదు. ఇంటికే పరిమితం చేశారు. శనివారం రాత్రి బాలికకు పురిటి నొప్పులు రావడంతో ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆదివారం ఆడబిడ్డ జన్మించింది.దీంతో తల్లికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో తల్లిబిడ్డలను అంబులెన్సులో తిరుపతికి తరలించారు. కాగా, అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com