ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో పెరిగిన నిరుద్యోగం

national |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 03:03 PM

గత 2016 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగం పెరగడం ఇదే తొలిసారి. గతేడాది ఫిబ్రవరిలో ఇది 5.9 శాతంగా ఉంది. ఈ మేరకు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి.పెద్దనోట్ల రద్దు తర్వాత 2018లో దాదాపు 1.10 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సీఎంఐఈ జనవరి నివేదిక వెల్లడించింది. మరోవైపు నోట్ల రద్దు ప్రభావం ఉద్యోగాలపై ఏ మేరకు ఉందో తెలిపే సమాచారం తమ వద్ద లేదని కేంద్రం పార్లమెంటులో వెల్లడించిందని ఆ సర్వేలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa