ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజేంద్రప్రసాద్‌ను గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 09:56 AM

ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి బలపరచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను గెలిపిద్దామని పట్టభద్రులకు జనసేన రాజకీయ వ్యవహారాల విభాగం చైర్మన్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌ పిలుపునిచ్చారు. ఆలపాటి గెలుపును కాంక్షిస్తూ విజయవాడ శేషసాయి కల్యాణమండపంలో సోమవారం జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజేంద్రప్రసాద్‌కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, మంత్రిగా పనిచేశారని, ఆయనను శాసనమండలికి పంపిస్తే సమస్యల పరిష్కారానికి పని చేస్తారని తెలిపారు. 2024 ఎన్నికల్లో జనసేన గెలుపుకోసం తెనాలిలో విస్తృత ప్రచారం చేశారని తెలిపారు. వైసీపీ తన ఐదేళ్ల పాలనలో ప్రజాధనాన్ని లూటీ చేసిందని, వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మనోహర్‌ ఆరోపించారు. జనసేన ఎప్పుడూ ప్రజాపక్షమే అన్నారు. గత ఐదేళ్లలో జనసైనికులు, వీర మహిళలపై దాడులు చేసిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. సోషల్‌ మీడియాలో ప్రశ్నించినందుకు జనసైనికులపై అక్రమ కేసులు పెట్టారని, జైళ్లలో నిర్బంధించారని, వాటిని తేలికగా మరచిపోబోమన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల స్ఫూర్తితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్‌ను గెలిపించాలని మంత్రి కందుల దుర్గేష్‌ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీగా పోటీచేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా - గుంటూరు జిల్లాలకు చెందిన జనసేన ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు, పీవోసీలు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, వీర మహిళలు ప్రాంతీయ సమన్వయకర్తలు, క్షేత్రస్థాయి నాయకులతో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మె ల్యే మండలి బుద్ధప్రసాద్‌, పి.అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభా ను, కిలారి రోశయ్య, నాయకులు బండ్రెడ్డి రామకృష్ణ, గాదె వెంకటేశ్వరరావు, బోనబోయిన శ్రీనివాసయాదవ్‌, చిల్లపల్లి శ్రీనివాసరావు, చిలకలపూడి పాపారావు, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్‌, బండి రామకృష్ణ, రావి సౌజన్య పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa