2025 ఛాంపియన్స్ ట్రోఫీకి సంభంధించిన టీం ఇండియా జెర్సీ రంగు, డిజైన్ కూడా మారిపోయి కొత్త జెర్సీ వచ్చింది. ఇతర జట్ల మాదిరిగానే పాకిస్తాన్ పేరు కూడా భారత జట్టు జెర్సీపై ముద్రించారు. ప్రతి ఐసిసి ఈవెంట్‌లో టోర్నమెంట్ లోగోతో పాటు, ఆతిథ్య దేశం పేరు కూడా జట్ల జెర్సీలపై ముద్రించడం ఆనవాయితీ. ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ కారణంగానే టోర్నమెంట్ కోసం రెడీ చేసిన ఇండియా జెర్సీపై పాకిస్తాన్ పేరు ఉంటుంది. అంతకుముందు భారత జట్టు జెర్సీ భిన్నంగా ఉంటుందన్న ఊహాగానాలు వచ్చాయి. దానిపై పాకిస్తాన్ పేరు పేర్కొనడం లేదని వార్తలు వచ్చాయి.ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీలో భారత ఆటగాళ్ల ఫోటోలు బయటకు వచ్చాయి. వీటిలో ఆతిథ్య దేశం పాకిస్తాన్ పేరు జెర్సీపై ఉంటుందని స్పష్టమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తయారు చేసిన జెర్సీలో మరో ప్రత్యేకత ఏమిటంటే దాని షోల్డర్ పై త్రివర్ణ పతాకం ఉంటుంది. ముందు భాగంలో INDIA అని పెద్ద అక్షరాలతో ముద్రించారు. కలర్ విషయానికి వస్తే.. అది నీలం రంగులో ఉంటుంది. ఇది సంవత్సరాలుగా టీం ఇండియా గుర్తింపు. దేనికి సంబంధించిన టీమిండియా ప్లేయర్స్ ఫోటో షూట్ ఫొటోస్ వైరల్ గా మారాయి.
These pics from today
How good#TeamIndia | #ChampionsTrophy pic.twitter.com/yM50ArMIj5
— BCCI (@BCCI) February 17, 2025
— BCCI (@BCCI) February 17, 2025
![]() |
![]() |